Rs praveen kumar | పోక్సో కేసులకు అడ్డాగా తెలంగాణ.. ఎందుకింత భయం సీఎం గారు..?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Rs praveen kumar | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక పటోళ్ల కార్తీక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.
Rs praveen kumar | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక పటోళ్ల కార్తీక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ పోక్సో కేసులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు రేవంత్ రెడ్డి.. ఆరుగురిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని అని హితవు పలికారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు.
నేరం జరిగి 55 రోజులయినా ఇంతవరకు పోలీసులు నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు అంతా రేవంత్ రెడ్డి వారి సోదరులను కాపాడడంలో బిజీగా ఉన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం కోసం షాబాద్‌కు పోదామని బయలుదేరితే చేవెళ్లలో పోలీసులు నన్ను, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి శంకర్ పల్లి పోలీసు స్టేషన్లో బంధించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్ ను కూడా అరెస్టు చేశారు. ఎందుకింత భయం సీఎం గారు..? వెంటనే రాజీనామా చేయండి. బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ పోక్సో కేసులకు అడ్డాగా మారింది
అరెస్టు చేయాల్సింది మమ్ములను కాదు రేవంత్ రెడ్డి.. ఆరుగురిని పాశవికంగా హత్య చేసిన నిందితుడిని
వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తమరు మాత్రం ఖమ్మంలో పిక్నిక్ లో బిజీగా ఉన్నారు
నేరం జరిగి 55 రోజులయినా ఇంతవరకు పోలీసులు… https://t.co/xKrXpvPPMx pic.twitter.com/ZcXc8AhcMK
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

