Huzurabad | హుజురాబాద్‌లో ప్రచారానికి తరలిన టీబీజీకేఎస్ నాయకులు

రెబ్బెన : హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపు కోసం ప్రచారం చేయటానికి సోమవారం బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ నాయకులు హుజురాబాద్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావులు మాట్లాడారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత, అధ్యక్షుడు వెంకట్రావ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రతి పక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొట్టి అక్కడి ప్రజలను చైతన్య పరచి టీఆర్ఎస్ పార్టీకే ఓటువేసే విధంగా ప్రచారం చేస్తామన్నారు.\
సింగరేణిలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు చాలా మంది ఉన్నారని, వారందరినీ కలిసి కారు గుర్తుకు ఓటు వేసే విధంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు గెల్లి రాయలింగు, ఏరియా కార్యదర్శి సంపత్‌రావు, జీఎం కమిటీ సభ్యుడు చంద్రశేఖర్, ఏరియా అసిస్టెంట్ కార్యదర్శి రామారావు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ చంద్రకుమార్, కైర్‌గూడ పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేశం, సీహెచ్‌పీ పిట్ కార్యదర్శి మెరుగు రమేశ్, ఏరియా దవాఖాన పిట్ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు మసాడి నారాయణ, ఓరం కిరణ్, సంపత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

