బూర్గంపహాడ్, అక్టోబర్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ఐటీసీ వాష్, ఐటీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచులు గురువారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు ఐటీసీ వాష్, ఐటీసీ ఎనీవోల ప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి శ్రమధానం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీజీ రామ్ జీ ఆధ్వర్యంలో మ్యాప్‌ను రూపొందించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్యం, పరిసరాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీలో సేవలందిస్తున్న ఎంపీడబ్ల్యూ వర్కర్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ వాష్, ఐటీసీ ఎన్టీవోల ప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి నాగిరెడ్డి, ఎంపీడబ్ల్యు వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.