అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం నిలకడగా ఉందని దవాఖాన వైద్యులు సోమవారం ప్రకటించారు. పోస్టు కొవిడ్ సమస్యలతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా చికిత్స అందిస్తున్న వైద్యులు గవర్నర్ తాజా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ప్రకటనను జారీ చేశారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వారు వెల్లడించారు. ఈ నెల 18 న కొవిడ్ బారిన పడగా ఏఐజీ దవాఖానలో చికిత్స తీసుకొని.. సంపూర్ణ ఆరోగ్యంతో 28న విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తిరిగి నిన్న (ఆదివారం) గవర్నర్ మరోసారి అస్వస్థతకు గురికావడంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చి దవాఖానలో చేరారు.