కనగల్, జనవరి 22 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కనగల్ మండలం దోరేపల్లి గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ అన్నారు. గురువారం దోరేపల్లిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -1 ఆధ్వర్యంలో వాలంటీర్స్ పాఠశాల, గ్రామ రోడ్ల వెంబడి ఉన్న కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురుగు కాల్వలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లమ్మ మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న సమస్యలపై అవగాహన కల్పిస్తూ పరిసరాల పరిశుభ్రతను గూర్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
పగిడిమర్రి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్- 6 ఆధ్వర్యంలో వాలంటీర్లు గ్రామ రోడ్ల వెంట ఉన్న కంప చెట్లు తొలగించి రహదారుల వెంబడి పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, యూనిట్ సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, అధ్యాపకులు కె.నాగరాజు, పంచాయతీ కార్యదర్శి గణేశ్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం మోహన్ రావు, బక్క రాజశేఖర్ పాల్గొన్నారు.