Kanagal : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి : సర్పంచ్ ఎల్లమ్మ
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కనగల్ మండలం దోరేపల్లి గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ అన్నారు. గురువారం దోరేపల్లిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -1 ఆధ్వర్యంలో వాలంటీర్స్ పాఠశాల, గ్రామ రోడ్ల వెంబడి ఉన్న కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి..
కనగల్, జనవరి 22 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కనగల్ మండలం దోరేపల్లి గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ అన్నారు. గురువారం దోరేపల్లిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -1 ఆధ్వర్యంలో వాలంటీర్స్ పాఠశాల, గ్రామ రోడ్ల వెంబడి ఉన్న కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురుగు కాల్వలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లమ్మ మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న సమస్యలపై అవగాహన కల్పిస్తూ పరిసరాల పరిశుభ్రతను గూర్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
పగిడిమర్రి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్- 6 ఆధ్వర్యంలో వాలంటీర్లు గ్రామ రోడ్ల వెంట ఉన్న కంప చెట్లు తొలగించి రహదారుల వెంబడి పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, యూనిట్ సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, అధ్యాపకులు కె.నాగరాజు, పంచాయతీ కార్యదర్శి గణేశ్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం మోహన్ రావు, బక్క రాజశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

