మోటకొండూర్, జనవరి 09 : మోటకొండూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు, గ్యాస్ స్టవ్, ఫ్యాన్‌తో పాటు చిన్నారులకు అవసరమయ్యే పలు వస్తువులను గ్రామానికి చెందిన దాత జూకంటి మధు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సేవాభావంతో ముందుకొచ్చిన దాత మధును అభినందించారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్‌కు పునాదులని, ఇక్కడ అందించే మౌలిక వసతులు మెరుగుపడితే విద్యాభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. చిన్ననాటి నుండే చదువుపై విద్యార్థులు పట్టు సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఏదుల్ల అనురాధ, ఉప సర్పంచ్ వంగాల నికిత మహేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భాస్కరుని రఘునాథరాజు, బుగ్గ కొమురయ్య, బాల్ద సిద్ధులు, భుమాండ్ల అశోక్, గాజుల వెంకటేశ్, సంగు శేఖర్ రెడ్డి, భూమండ్ల వెంకటేశ్, కొల్లూరు రంజిత్, ఆలేటి ఉమేశ్ పాల్గొన్నారు.