ఖిల్లాఘణపురం, జూలై 8 : ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని ఓ లబ్ధిదారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంకటాంపల్లిలో బుధవారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య-అంజలమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టగా మరో ఇద్దరు కుమారులు శివశంకర్, సిద్ది రాములు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. సిద్దిరాములు(28) మేస్త్రి పని చేస్తూ ఇంటి పనులు చూసుకుంటూ ఉండేవాడు.
ఇటీవల ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా ఇందిరమ్మ ఇల్లు రావడంతో ఆయన ఇంటి నిర్మాణం స్లాబ్ లెవల్‌కు వచ్చింది. కానీ ఆ ఇంటికి సంబంధించిన బిల్లు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారితో అప్పు చేసి ఇంటి ని ర్మాణం పూర్తి చేశా డు. అదే విధంగా పంట కోసం కూడా అప్పు చేయగా వ ర్షాభావ పరిస్థితుల్లో పంట మొలకెత్తక తీవ్ర మనస్తాపానికి గురైన రాము ఉద యం తల్లిదంద్రులతో గొడవకు దిగా డు. వేసిన పంట చేతికి రాలేదని కట్టి న ఇంటి బిల్లు రాలేదని మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వండి అని తల్లిదండ్రులను అడిగితే తమ దగ్గర డబ్బులు లేవు ఇందిరమ్మ ఇంటి బిల్లు వచ్చిన తర్వాత కొంతమందికి ఇద్దామని సముదాయించా రు.
పంట చేతికి వచ్చినప్పుడు మరికొంత మందికి ఇద్దామని చెప్పడంతో రాము వినలేదు. కనీసం కొం త భూమిని అమ్మి అందరి అప్పులు కట్టేద్దామని తల్లిదండ్రులతో అనగా వారు ఏమి చెప్పకపోవడంతో క్షణికావేశంలో నేను చనిపోతానని తాడు తీసుకొని ఇంటి నుంచి పరిగెత్తాడు. గమనించిన తల్లిదండ్రులు ఆయన వెంటపడినా దొరకలేదు. చివరకు రాములు రెడ్డి చెరువు సమీపంలో ఈద్గా గుట్టపై ఒక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పా రు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.