సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో వీధి దీపాల మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేతకు ఉపయోగించే ‘సై బకెట్ ల్యాడర్’ వాహనాల అద్దె టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున కమీషన్ల పర్వం నడిచిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అవసరానికి మించి వాహనాలను అద్దెకు తీసుకోవడం, మార్కెట్ ధరల కంటే పలుమార్లు అధిక అద్దెలు చెల్లించేలా టెండర్లు ఖరారు చేయడం, తక్కువ ధర కోట్ చేసిన సంస్థలను పక్కన పెట్టి అధిక ధరలు పేర్కొన్న కాంట్రాక్టర్లకే పనులు అప్పగించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి.
– సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ)
గతంలో కేవలం ఆరు జోన్లకు రెండు చొప్పున మాత్రమే సై బకెట్ ల్యాడర్లను వినియోగించేవారు. వినాయక చవితి, వర్షాకాలం సంక్షోభాలు, వీధి దీపాల అత్యవసర మరమ్మతుల వంటి సమయాల్లో.. అంటే మే నెల నుంచి డిసెంబర్ వరకు మాత్రమే అద్దెకు తీసుకునేవారు. నెలకు రూ.1.20 లక్షల అద్దె మాత్రమే చెల్లించేవారు. కానీ ఇప్పుడు ప్రతి సరిల్కు ఒక వాహనాన్ని కేటాయించడంతో పాటు, అవసరం ఉన్నా లేకపోయినా అద్దె చెల్లించేలా టెండర్లు రూపొందించడం వెనుక భారీ సామ్ దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): సీఎంసీలో ఇటీవల నిర్వహించిన స్కై బకెట్ ల్యాడర్ టెండర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నెలకు సుమారు రూ.1.20 లక్షల అద్దెతో లభించే వాహనాలకు రూ.3.50 లక్షల వరకు అద్దె చెల్లించేలా టెండర్లు ఖరారు చేశారు. వాస్తవానికి కొనుగోలు ధర రూ.23 లక్షలైతే.. కేవలం ఏడాది అద్దె రూపంలో ఒకో వాహనానికి ఏకంగా రూ.44 లక్షల వరకు..అంటే ఆయా వాహనాల కొనుగోలుకు రూ.13.80 కోట్లు ఉంటే…ఏటా అద్దెల రూపంలోనే రూ.26.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
దోపిడీ ఫార్ములా విస్తరణ?
ఇటీవల సీఎంసీలో అర్బన్ బయోడైవర్సిటీ (యూబీడీ) విభాగం ద్వారా ‘సై బకెట్ ల్యాడర్ల కోసం నిర్వహించిన టెండర్లు ప్రజాధనాన్ని ఎలా వృథా చేస్తున్నారో చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా బహిరంగ మారెట్లో నెలకు సుమారు రూ. 1.20 లక్షల అద్దెకు లభించే ఒకో స్కై బకెట్ ల్యాడర్ వాహనానికి, సీఎంసీ టెండర్లలో ఏకంగా రూ.3.50 లక్షల వరకు అద్దె చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సీఎంసీలో విజయవంతంగా అమలు చేసినా ఈ దోపిడీ ఫార్ములాను.. జీహెచ్ఎంసీతో పాటు మరో మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా విస్తరించేందుకు చకచకా అడుగులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కొనుగోలు కంటే అద్దెకే మొగ్గు!
మారెట్లో సరికొత్త టెక్నాలజీతో కూడిన ఒక కొత్త సై బకెట్ ల్యాడర్ వాహనం కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 23 లక్షల వరకు ఖర్చవుతుంది. కార్పొరేషన్లకు దీర్ఘకాలిక అవసరాలు ఉన్నప్పుడు సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఆస్తి మిగలడమే కాకుండా శాశ్వత పరిషారం దొరుకుతుంది. కానీ ఇకడి అధికారులు మాత్రం తమ తీరే వేరు అంటున్నారు. మూడు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 60 సరిళ్లకు సరిల్కు ఒకటి చొప్పున మొత్తం 60 వాహనాలను ఏడాది పొడవునా అద్దెకు తీసుకుంటున్నారు. దీనివల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్పొరేషన్ల ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతున్నా పట్టించుకోవడం లేదు.
తకువ కోట్ చేసిన వారికి మొండిచేయి..
సై బకెట్ ల్యాడర్ వాహనాల టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లలో నిబంధనల ప్రకారం 30 నుంచి 40 శాతం తకువ ధర (లెస్) కోట్ చేసిన సంస్థలను సాంకేతిక కారణాల సాకుతో పకనబెట్టేసినట్లు తెలుస్తోంది. కొంతమంది ఉన్నతాధికారులు సిండికేట్‌గా మారి, కమిషనర్లను తప్పుదారి పట్టిస్తూ అధిక ధరలు కోట్ చేసిన కాంట్రాక్టర్లకే పనులు దకేలా చక్రం తిప్పారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అన్నింటి కంటే సాధారణంగా వాహనాలు, మెకానికల్ వ్యవహారాల టెండర్లను ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యవహారాన్ని కావాలనే అర్బన్ బయోడైవర్సిటీ (యూబీడీ) విభాగానికి బదిలీ చేయడం వెనుక అధికారుల ఆంతర్యం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెండర్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఉన్నతస్థాయి నిఘా విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని, కమిషనర్లను తప్పుదారి పట్టించిన అధికారులపై, నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.