ఖమ్మం రూరల్, జూలై 27 : సిఐటియు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండలం మాజీ జడ్పిటిసి పెరుమల్లపల్లి మోహన్ రావును సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య వీరయ్య పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం మోహన్రావు సతీమణి కళావతి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసింది. దీంతో సోమవారం రూరల్ మండలంలోని ఆరెంపుల గ్రామంలో ఉన్న మోహన్ రావు ఇంటికి వెంకట వీరయ్య వెళ్లారు. తొలుత కళావతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోహన్ రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణ, కృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.