మహబూబ్నగర్, జూలై 8 : ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ పద్ధతులను అనుసరిస్తూ ఇబ్బడి ముబ్బడిగా కోట్ట రూపాయలు ఖర్చు చేసి గెలిచి న ఎంపీ, ఎమ్మెల్యేల జీతభత్యాలు భారీగా పెం పునకు మాత్రం చట్టసభలలో ప్రత్యేక చర్చ అధిక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి.. కానీ ప్రజాసేవారంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ దవాఖాన కాం ట్రాక్టు కార్మికుల జీతాల పెంపునకు మాత్రం బడ్జెట్ ఉండదా అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పీ సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ దవాఖాన కార్మికులకు కనీస వేత నం రూ.26 వేలకు పెంచాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో భాగం గా రెండో రోజైన బుధవారం మహబూబ్నగర్ ప్ర భుత్వ దవాఖాన ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ ప్రభు త్వం ప్రభుత్వ దవాఖాన కార్మికలకు వేతనాలు పెంచకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతుం దని ఆరోపించారు. కార్మికుల వేతనాలు దండుకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు కనీస వేతనం రూ.26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్య లో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రంగన్న, దేవానంద్, చెన్నయ్య, మొగులయ్య, బా లరాజు, నర్సింహ, అంజి తదితరులు పాల్గొన్నారు.