ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని ఆత్మహత్య
ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని ఓ లబ్ధిదారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంకటాంపల్లిలో బుధవారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య-అంజలమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టగా మరో ఇద్దరు కుమారులు శివశంకర్, సిద్ది రాములు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. సిద్దిరాములు(28) మేస్త్రి పని చేస్తూ ఇంటి పనులు చూసుకుంటూ ఉండేవాడు.
ఖిల్లాఘణపురం, జూలై 8 : ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని ఓ లబ్ధిదారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంకటాంపల్లిలో బుధవారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య-అంజలమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టగా మరో ఇద్దరు కుమారులు శివశంకర్, సిద్ది రాములు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. సిద్దిరాములు(28) మేస్త్రి పని చేస్తూ ఇంటి పనులు చూసుకుంటూ ఉండేవాడు.
ఇటీవల ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా ఇందిరమ్మ ఇల్లు రావడంతో ఆయన ఇంటి నిర్మాణం స్లాబ్ లెవల్‌కు వచ్చింది. కానీ ఆ ఇంటికి సంబంధించిన బిల్లు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారితో అప్పు చేసి ఇంటి ని ర్మాణం పూర్తి చేశా డు. అదే విధంగా పంట కోసం కూడా అప్పు చేయగా వ ర్షాభావ పరిస్థితుల్లో పంట మొలకెత్తక తీవ్ర మనస్తాపానికి గురైన రాము ఉద యం తల్లిదంద్రులతో గొడవకు దిగా డు. వేసిన పంట చేతికి రాలేదని కట్టి న ఇంటి బిల్లు రాలేదని మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వండి అని తల్లిదండ్రులను అడిగితే తమ దగ్గర డబ్బులు లేవు ఇందిరమ్మ ఇంటి బిల్లు వచ్చిన తర్వాత కొంతమందికి ఇద్దామని సముదాయించా రు.
పంట చేతికి వచ్చినప్పుడు మరికొంత మందికి ఇద్దామని చెప్పడంతో రాము వినలేదు. కనీసం కొం త భూమిని అమ్మి అందరి అప్పులు కట్టేద్దామని తల్లిదండ్రులతో అనగా వారు ఏమి చెప్పకపోవడంతో క్షణికావేశంలో నేను చనిపోతానని తాడు తీసుకొని ఇంటి నుంచి పరిగెత్తాడు. గమనించిన తల్లిదండ్రులు ఆయన వెంటపడినా దొరకలేదు. చివరకు రాములు రెడ్డి చెరువు సమీపంలో ఈద్గా గుట్టపై ఒక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పా రు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

