Sandeep Shandilya | ఛార్మినార్, ఫిబ్రవరి 11 : మాదక ద్రవ్య రహిత సమాజం కోసం చిన్నప్పటి నుండే కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య (Sandeep Shandilya) కోరారు. మాదక ద్రవ్య వినియోగంతో జరిగే దుష్పరిమాణాలపై బండ్లగూడ గౌస్ నగర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకు నిర్వహించిన అవగాహనా సదస్సులో సందీప్ శాండిల్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మాదకద్రవ్యాల వినిమయం భారీగా పెరిగిపోతుందన్నారు.
మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని నియంత్రించే చర్యల కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎప్పటికప్పుడు మాదక ద్రవ్య సరఫరాదారులు కొత్త ఎత్తుగడలతో సమాజంలోకి వాటిని తీసుకువస్తూనే వున్నారు. వాటిని కట్టడి చేయడానికి విద్యార్థులు సైతం పోలీసులకు సహకారం అందించాలని సూచించారు. ఇంటితోపాటు మన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలను విద్యార్థులు గుర్తించాలన్నారు. మన చుట్టూ ఏదైనా తప్పులు జరిగితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని నిర్దేశించారు.
నేడుమాదకద్రవ్యాల దుర్వినియోగ బాధితులు కుటుంబ, సామాజిక ఒంటరితనంతో తిరస్కరణకు గురవుతున్నారన్నది ఒక భయంకరమైన వాస్తవం అని సందీప్ శాండిల్య వాపోయారు. అలాంటి వాటిని అరికట్టి సామాజిక బాధ్యత కలిగిన రేపటి పౌరులుగా విద్యార్థులు వెలగాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ ఏసీపీ మనోజ్ కుమార్, నార్కోటిక్స్ ఏసీపీ సుబ్బరామి రెడ్డి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు, డీఐ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ నాగ రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mancherial | కోనూర్‌లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు