ఖమ్మం కమాన్‌బజార్, జూలై 31: పెండింగ్‌లో ఉన్న బోధనా రుసుముల బకాయిలను, సాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ సూళ్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్స్, సాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ సూళ్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిధులను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
విద్యార్థుల అకౌంట్స్‌లోనే ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తామని చెప్పడం వల్ల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ముందే ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని, దీంతో తీవ్రమైన ఆర్థిక భారానికి విద్యార్థుల తల్లిదండ్రులు గురవుతున్నారని వాపోయారు. జీవోలతో సంబంధం లేకుండా పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్, రూ.200 కోట్ల బెస్ట్ అవైలబుల్ సూల్స్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ సం ఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఈశ్వరి, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు శ్రీకాంత్, యశ్వంత్, రాము, ఉదయ్‌కిరణ్, చైతు, వినోద్, రాజశేఖర్, చందు, సంజయ్, వినోద్, వెంకటేష్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.