పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజలకు అంకితభావంతో సేవలందించిన గొప్ప నాయకుడని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కొనియాడారు.
- పువ్వాడ, తాతా మధు, సండ్ర, లింగాల, దిండిగాల తదితర ప్రముఖుల ప్రగాఢ సంతాపం, నివాళి
నమస్తే నెట్వర్క్, జూలై 31 : తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజలకు అంకితభావంతో సేవలందించిన గొప్ప నాయకుడని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కొనియాడారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు శుక్రవారం సంతాపం వ్యక్తం చేసి నివాళులు అర్పించారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు నర్సంపేటలోని ఆయన నివాసానికి వెళ్లి పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళి అర్పించిన వారిలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఉన్నారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాజకీయాలకు తీరనిలోటని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

