ముంబై, అక్టోబర్ 21: స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీలపై ప్రభావం చూపాయి. ప్రారంభంలో 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 73.48 పాయింట్ల నష్టంతో 81,151.27 వద్ద ముగిసింది. నిఫ్టీ 72.95 పాయింట్లు కోల్పోయి 24,781.10 వద్ద స్థిరపడింది. కొటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ అత్యధికంగా నష్టపోయాయి.