Srisailam Dam | శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం వరకు నీటిని విడుదల చేసి డ్యాం క్రస్ట్ గేట్లను మూసివేశారు. అదే విధంగా జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 91,806, విద్యుదోత్పత్తి ద్వారా 20,215, సుంకేశుల నుంచి 21,725 క్యూసెక్కుల నీరు విడుదలైంది. సాయంత్రం వరకు రిజర్వాయర్‌కు 86,456 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదయింది.
కుడిగట్టు విద్యుదోత్పత్తి కేంద్రం ద్వారా 31,158, ఎడమగట్టు విద్యుదోత్పత్తి కేంద్రం ద్వారా 31,315 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఏంసీలు కాగా ప్రస్తుతం 884.60 అడుగుల్లో 213.40 టీఏంసీల నీటి నిల్వలు ఉన్నాయి.