ఉద్యోగులను మోసగించిన కాంగ్రెస్ : శ్రీనివాస్‌గౌడ్
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ కోసం ముందుండి పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
సమస్యలు పరిష్కారం కాక.. ఇప్పుడు వారే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 317 జీవోపై సమీక్షించి భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా చేస్తామని మాట ఇచ్చి తప్పారని, బదిలీల క్యాలెండర్ ఇస్తామని, జర్నలిస్టులు, ఉద్యోగులకు అన్ని ప్రైవేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని పలువార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

