SLW vs SAW : ఎట్టకేలకు శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ మొదలైంది. వర్షం అంతరాయం కారణంగా ఐదుగంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 20 ఓవర్లు కుదించారు అంపైర్లు. అయితే.. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన కవిష దిల్హరి(14) ఔటయ్యింది. డీక్లెర్క్ ఓవర్లో మిడాన్‌లో షాట్ ఆడిన ఆమె లారా వొల్వార్డ్త్ చేతతికి చిక్కింది.
ఆ తర్వాత మ్లాబా ఔలింగ్‌లో సమరవిక్రమ (13) సైతం అదే దిశలో బంతిని గాల్లోకి లేపి.. సఫారీ కెప్టెన్‌కు దొరికిపోయింది. దాంతో.. 63 వద్దే లంక నాలుగు వికెట్లు పడ్డాయి. ఫామ్‌లో ఉన్న ఇద్దరూ ఔటవ్వడంతో నీలాక్షి డిసిల్వా(6), విష్మీ గుణరత్నే(22)లు జట్టు స్కోర్ వంద దాటించే పనిలో ఉన్నారు. 15 ఓవర్లకు స్కోర్. 71/4.
Harshitha Samarawickrama ❌
Kavisha Dilhari ❌#women #cricket #CWC25 #SLvSA pic.twitter.com/1vIR3ndI56— CricketTimes.com (@CricketTimesHQ) October 17, 2025
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఐదుగంటల విరామం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగ్గంట నుంచి స్టేడియాన్ని ముంచెత్తిన వర్షం తగ్గడంతో శ్రీలంక, దక్షిణాఫ్రికా క్రికెటర్లు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వాన తగ్గడంతో.. మైదానం సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఆటకు అంతా సిద్దం చేశారు. ఐదు గంటల మ్యాచ్ జరుగనందున డకవర్త్ లూయిస్ ప్రకారం 20 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తున్నారు. దాంతో.. 46/2తో శ్రీలంక ఇన్నింగ్స్ కొనసాగించింది.