Chennai Open : జూనియర్ స్థాయిలో అదరగొడుతున్న యువ క్రీడాకారిణులకు మాయా రాజేశ్వరన్ (Maaya Rajeshwaran), సహజ యమలపల్లి (Sahaja Yamalapalli)కి మరో మెగా టోర్నీ అవకాశం దక్కింది. అక్టోబర్ చివరి వారం నుంచి స్వదేశంలో జరుగబోయే చెన్నై ఓపెన్‌లో ఇద్దరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. డబ్ల్యూటీఏ 250 టోర్నీ అయిన చెన్నై ఓపెన్ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకూ జరుగనుంది.
స్పెయిన్‌లోని రఫెన్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయా రాజేశ్వరన్ జూనియర్ లెవల్లో చెలరేగిపోతోంది. ఇప్పటికే
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రాణించిన ఈ యంగ్‌స్టర్ ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌తో పాటు యూఎస్ ఓపెన్‌లోనూ పాల్గొంది. అంతేకాదు జూన్‌లో జర్మనీలో జరిగిన గ్రేడ్ 2 ఐటీఎఫ్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన నియోల్లా మంతాను 6-2, 6-4తో మట్టికరిపించి ఏడో టైటిల్ ఖాతాలో వేసుకుంది.
Breaking News: India’s No.1 🇮🇳 Sahaja Yamalapalli and Junior No.1 🇮🇳 Maaya Rajeshwaran have received main draw wildcards for the WTA 250 Chennai Open💪🏻
Sahaja, currently ranked #247, recently made headlines by defeating former US Open Champion Sloane Stephens, while Tamil Nadu’s… pic.twitter.com/8Mqa0SWLOM
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) October 17, 2025
సహజ యమలపల్లి కూడా ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటీవలే మెక్సికోలో ముగిసిన డబ్ల్యూటీఏ 125కే అబియెర్టో టాంపికో టోర్నీలో యూఎస్ ఓపెన్ 2017 ఛాంపియన్ స్లోవనే స్టీఫెన్స్‌ను ఓడించింది యువకెరటం. అంతేకాదు.. 16వ రౌండ్లో వరల్డ్ ర్యాంకర్ 125 పెట్రా మర్సింకోను మూడు సెట్ల హోరాహోరీ పోరులో 7-5, 6-7, 6-1తో చిత్తు చేసింది. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా యమలపల్లికి చెన్నై ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కింది.