హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు-2025 వరించింది. రాష్ట్రాల పనితీరులో ద్వితీయ బహుమతి లభించింది. ఎనర్జీ కన్జర్వేషన్‌కు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) తీసుకుంటున్న చర్యలకుగాను ఈ అవార్డు దక్కింది. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్, రెడ్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ అనిల అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీ రెడ్కో జనరల్ మేనేజర్ జీఎస్వీ ప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.