న్యూఢిల్లీ, డిసెంబర్ 14: గగన్‌యాన్ (మానవ రహిత) సహా ఏడు రాకెట్ ప్రయోగాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వరుసగా చేపట్టబోతున్నది. మార్చి 2026లోగా ఈ ఏడు ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో మొదటిది, ‘బ్లూబర్డ్-6’ శాటిలైట్‌ను వచ్చే వారం ప్రయోగిస్తున్నారు. ‘గగన్‌యాన్’ మిషన్‌లో మానవ రహిత ప్రయోగం ద్వారా ‘వ్యోమిత్రా’ రోబోను రోదసిలోకి పంపి, తిరిగి భూమి మీదకు తీసుకురాన్నారు. భారత్ చేపట్టే మానవ సహిత రోదసి యాత్ర (2027లో)కు ఇది సన్నాహక ప్రయోగం లాంటిది.