Ashwin : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు హర్షిత్ రానా (Harshit Rana)ను ఎంపిక చేయడంపై విమర్శించిన వాళ్లు చాలామందే. మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ నుంచి అశ్విన్ వరకూ అతడిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అయితే.. 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేస్తారా? అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మండిపడడంతో.. రానాపై విమర్శలు కాస్త తగ్గాయి. ఇప్పుడు అశ్విన్ కూడా యూటర్న్ తీసుకున్నాడు. ఏ క్రికెటర్‌ను అయినా హద్దు మీరి విమర్శించడం తగదని ఎల్లప్పుడూ చెబుతుంటానని ఈ వెటరన్ ప్లేయర్ అన్నాడు.
‘తనపై విమర్శల దాడికి సంబంధించిన రీల్‌ను హర్షిత్ చూసి ఉంటే ఎంతో బాధపడేవాడు. అతడు భారత్ తరపున ఆడబోతున్నాడు. ఒకవేళ అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఆ రీల్ చూశారనుకోండి వాళ్లు ఏమనుకుంటారు. అయితే.. విమర్శించడం అనేది ఆటగాళ్ల నైపుణ్యాలు, వాళ్ల ప్రదర్శనకే పరిమితం కావాలి.అంతేతప్ప వ్యక్తిగతంగా ఉండకూడదు. ఒకటిరెండుసార్లు చాలా సరదాగానే అనిపిస్తుంది. కానీ, ప్రతిసారి అదే పనిగా విమర్శించకూడదు. విమర్శల దాడి అనేది వ్యక్తిగతంగా మారినప్పుడు పరిణామాలూ వేరేలా ఉంటాయి.
R Ashwin thrashing Kris Srikkanth now who went personal against Harshit Rana to get views on his YouTube channel.🔥
Karma is Boomerang 🪃
Thank You Anna @ashwinravi99pic.twitter.com/uHVYDXHiFn
— कट्टर INDIA समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) October 17, 2025
కామెంటేటర్ సంజయ్ మంజ్రేర్ నన్ను ప్రతిసారి విమర్శించేవారు. కానీ, నేను అతడిపై కక్ష పెంచుకోలేదు. వాళ్ల మాటలు తప్పోఒప్పో వాళ్లకే తెలుసు. నేను ఆ మాటల్ని వ్యక్తిగతంగా తీసుకోనంతవరకూ నేను బాగానే ఉన్నాను అని తన యూట్యూబ్ ఛానెల్లో అశ్విన్ వెల్లడించాడు. అంతేకాదు ఇప్పుడు హర్షిత్‌ను విమర్శిస్తున్న వారంతా.. అతడు గొప్పగా బౌలింగ్ చేసినప్పుడు ప్రశంసిస్తారా? అని ప్రశ్నించాడు. ప్రస్తుతం అందరూ హర్షిత్ రానాను టార్గెట్ చేస్తున్నారు. వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వచ్చే ఏడాది ఈ పేసర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తే.. మీరంత అతడిని మెచ్చుకుంటారా?’ అని పేర్కొన్న అశ్విన్ విమర్శకులను ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు.