Shantha Rangaswamy : భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి (Shantha Rangaswamy) కీలక పదవికి ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా రంగస్వామి ఎన్నికయ్యారు. ఢిల్లీ మాజీ ఓపెనర్ వెంకట్ సుందరం కార్యదర్శిగా .. దీపక్ జైన్ కోశాధికారిగా, జ్యోతి థాటే, సంతోష్ సుబ్రమణియన్‌లు ఐసీఏ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో ఐసీఏ ప్రతినిధిగా మాజీ కెప్టెన్ సుధా షా, ఐపీఎల్ పాలక మండిలిలో ప్రతినిధిగా శుభాంగి కులకర్ణిలకు బాధ్యతలు అప్పగించారు. పురుషుల విభాగం నుంచి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు ఛాముండేశ్వరనాథ్ (V Chamundeswara Nath) ఎంపికయ్యారు.
చెన్నైలో జన్మించిన రంగస్వామి భారత క్రికెట్లో దిగ్గజ ప్లేయర్. మహిళల జట్టుకు తొలి కెప్టెన్‌గా పేరొందిన ఆమె.. మొట్టమొదటి టెస్టులో వెస్టిడీస్పై విజయాన్ని అందించారు. ఆల్‌రౌండర్ అయిన రంగస్వామి 1976 నుంచి 1991 మధ్య కాలంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు.
Heartfelt congratulations to the newly elected Office Bearers of the Indian Cricketers’ Association for the term 2025-28!
Wishing you all the best for your tenure!#ICA #IndianCricketersAssociation #Congratulations #Election #results #formercricketers #welfareofformercricketers pic.twitter.com/sFFZWhAcHj
— Indian Cricketers’ Association (@IndCricketAssoc) October 16, 2025
కెరియర్లో 16 టెస్టులు మాత్రమే ఆడిన ఆమె.. న్యూజిలాండ్‌పై చరిత్రాత్మక విజయంలో భాగమయ్యారు. ఎనిమిది మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె మొత్తంగా సుదీర్ఘ ఫార్మాట్లో 32.60 సగటుతో 750 రన్స్ సాధించిన రంగస్వామి.. 21 వికెట్లు పడగొట్లారు. మహిళా క్రికెట్‌కు విశేష సేవలందించిన తనకు 1976లో అర్జున అవార్డు లభించింది.