Vishmi Gunaratne : శ్రీలంక ఓపెనర్ బ్యాటర్ విష్మీ గుణరత్నే (Vishmi Gunaratne ) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ 5వ ఓవర్లో ఆమె వేగంగా సింగిల్ తాయాలకునుంది. కానీ ఫీల్డర్ వికెట్లవైపు బంతిని వేగంగా విసిరింది. అయితే.. ఆ బంతి గుణరత్నే ఎడమ మోకాలికి గట్టిగా తాకింది. దాంతో, నొప్పిని భరించలేకపోయిందామె. ఫిజియో వచ్చి పరీక్షించినా ఉపశమనం కలగకపోవడంతో స్ట్రెచర్ మీద తరలించారు.
అనంతరం హాసిని పెరీరా(4) క్రీజులోకి వచ్చింది. కానీ, ఆమెను క్లాసీ క్లీన్ బౌల్డ్ చేసి వెనక్కి పంపింది. కాసేపటికే ఆటపట్టును సైతం ఎల్బీగా ఔట్ చేసింది సఫారీ పేసర్. ఆ తర్వాత కవిష దిల్హరి(6 నాటౌట్), హర్షిత సమరవిక్రమ(5 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. కానీ, 12వ ఓవర్ పూర్తికాగానే వర్షం మొదలైంది. వాన అంతరాయం కలిగించే సరికి లంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.
ఇదే వేదికపై ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కెప్టెఎన్ చమరి ఆటపట్టు (Chamari Athapaththu) సైతం ఇలానే మైదానం వీడింది. పవర్ ప్లేలో సింగిల్ తీసే క్రమంలో ఆమెకుకండరాలు పట్టేశాయి. దాంతో.. కుంటుతూనే పరుగు పూర్తి చేసిన ఆటపట్టు నొప్పిని భరించలేక నాన్ స్ట్రయికింగ్ వద్ద నేలపై కూలబడింది. ఫిజియో వచ్చి పరీక్షించినా లాభం లేకపోవడంతో స్ట్రెచర్ మీద మైదానం నుంచి బటయకు తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన ఆటపట్టు.. స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగింది. దాంతో.. ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది.