ఇల్లెందు, అక్టోబర్ 17 : భద్రాచలం ఐటీడీఏ పరిధి ఆశ్రమ పాఠశాలలో ఇల్లెందు జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఏటీడీఓ భారతి దేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లెందు జోనల్ స్థాయిలో మొత్తం 12 పాఠశాలలు ఉన్నాయని, వాటిలో ఏడు బాలుర పాఠశాలలు, ఐదు బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తొలిరోజు శుక్రవారం ఏడు బాలుర పాఠశాలలకు చెందిన బాలురకు వాలీబాల్, కో కో, కబడ్డీ , చెస్, క్యారం, అథ్లెటిక్స్, ఆర్చరీ తదితర మొత్తం ఎనిమిది రకాల ఆటల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
అలాగే శనివారం బాలికల క్రీడా పోటీలను నిర్వహించి మొత్తం 275 మంది విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, క్రీడల వల్ల శారీరిక, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. క్రీడల్లో రాణించిన వాళ్లు భవిష్యత్లో అన్ని రంగాల్లో రాణిస్తారని, ప్రతి ఒక్కరు క్రీడలపై మక్కువ పెంచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నాగమణి, రాష్ట్ర క్రీడా విభాగం నాయకులు బుగ్గ వెంకటేశ్వర్లు, ఎస్ ఓ గోపాలరావు, హెచ్ఎస్ఓ రాంబాబు, కృష్ణవేణి, లక్ష్మీ, సరోజినీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Yellandu : ఇల్లెందు జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం