మహబూబ్‌నగర్ : కామారెడ్డి డిక్లరేషన్ ( Kamareddy Declaration ) ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ బద్దంగా చట్ట సవరణ చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ ( BC Reservations ) ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.
జీవో ప్రకారం రిజర్వేషన్ సాధ్యం కాదని బీఆర్ఎస్ తరుపున చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలోనైనా రిజర్వేషన్ ఉంటే రాజకీయంగా సమానత వస్తుందని, రాజ్యాంగ పరంగా.. రాజకీయం గా ఉన్నామనే భావన ప్రజల్లో ఉంటదని వెల్లడించారు. విద్య, ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు.
శనివారం నాటి తెలంగాణ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని, ఆర్టీసీ బస్సులను అధికారులు బయటికి తీయవద్దని, విద్య.. వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశం లో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజ్, మాజీ జడ్పీటీసీ నరేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, సీనియర్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, నవకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.