Ajit Agarkar : భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma )లు తమ కెరియర్లోనే కఠిన సవాల్ ఎదుర్కొంటున్నారు. టన్నుల కొద్దీ పరుగులు, ఆస్ట్రేలియాపై తిరుగులేని రికార్డు ఉన్నా సరే.. మరోసారి తమ సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇద్దరికీ. అందుకు కారణం.. వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కడంపై నెలకొన్న సందిగ్ధత. విశ్వ సమరానికి మరో రెండేళ్లు ఉన్నందున ఆసీస్ పర్యనటనలో రెచ్చిపోవాలని అనుకుంటున్నారిద్దరూ. మరోవైపు ఈ సిరీస్‌తోనే విరాట్, హిట్‌మ్యాన్ భవితవ్యం తేలిపోనుందనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో వెటరన్ ప్లేయర్ల గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar) సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డేలో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన రోహిత్, విరాట్ కోహ్లీలపైనే అందరి కళ్లు నిలిచాయి. అయితే.. ఈ సిరీస్‌లో మూడేసి సెంచరీలు బాదినా సరే వరల్డ్ కప్ ఛాన్స్‌పై స్పష్టత ఇవ్వలేనని అగార్కర్ అన్నాడు. ‘కోహ్లీ, హిట్‌మ్యాన్ ఇద్దరూ వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు. వాళ్లను ప్రతిసారి పరీక్షించడం సరికాదు. ఒకసారి రోహిత్, విరాట్ మైదానంలోకి దిగి ఆడడం మొదలెట్టాక.. వాళ్ల ఆటను విశ్లేషిస్తాం. అంతేతప్ప వాళ్లను జట్టులో కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోం.
#NDTVWorldSummit | What Ajit Agarkar (@imaagarkar), Chief Selector, BCCI has to say about Virat Kohli and Rohit Sharma? Listen in @preetiddahiya #NDTVWorldSummit2025 pic.twitter.com/Cxv75dO32k
— NDTV (@ndtv) October 17, 2025
ఒకవేళ ఆస్ట్రేలియాపై పరుగులు సాధించకున్నా సరే రోకోపై వేటు వేయం.అదే సమయంలో వీరు వరుసగా మూడు సెంచరీలు బాదినా సరే వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉంటారనేది చెప్పలేను. కోహ్లీ, రోహిత్‌కు తమ బాధ్యతలు తెలుసు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇద్దరూ ప్రాక్టీస్ చేశారు. పెర్త్ వన్డేకు ముందు నెట్స్‌లో ఇరువురు చక్కని షాట్లు ఆడారు. ఫిట్నెస్ పరంగానూ చాలా మెరుగ్గా ఉన్నారు’ అని మాజీ పేసర్ వెల్లడించాడు.