Sports | రాయపోల్, నవంబర్ 10 : సిద్దిపేట జిల్లా రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థి, జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు యూ స్వామి సోమవారం పాఠశాల క్రీడాకారులకు వాలీబాల్ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలకు తోచిన విధంగా సహాయం చేయాలని సంకల్పంతో క్రీడా దుస్తులను అందించడం జరిగిందన్నారు.
రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరింత ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని.. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. విద్యార్థులు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులకు స్పోర్ట్స్ పరంగా తన వంతు సాయం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, గ్రామ యువకులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష