తిరుమల : మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్‌లో భారత మహిళా ( Indian Women Team ) జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల ( Tirumala ) లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయులు తిరుమల అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఆశీస్సులతో మహిళల టీమిండియా మెరుగ్గా ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయ అందించాలని శ్రీవారి కోరుకున్నట్లు తెలిపారు
. కాగా ఫైనల్ మ్యాచ్‌ను ప్రేక్షకులు తిలకించేందుకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీఏ ఆధ్వర్యంలో ఫ్యాన్ పార్క్‌ను సిద్ధం చేశారు. బిగ్ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా స్పోర్ట్సు మైదానంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు క్రీడాప్రాధికర సంస్థ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.
ఇప్పటి వరకు భారత మహిళల జట్టు రెండు సార్లు ఫైనల్‌కు వచ్చి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చివరిసారిగా 2017లో భారత ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. గత గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 338 భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించిన భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం మరికొద్ది నిమిషాల్లో దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.