Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. క్షతగాత్రులకు రూ.3లక్షల చొప్పున సాయం చేస్తామన్నారు.
కాశీబుగ్గలోని ఘటనాస్థలిని పరిశీలించడంతో పాటు, పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నారా లోకేశ్ పరామర్శించారు. ఆనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. 94 ఏళ్ల వృద్ధుడు తన సొంత ఖర్చులతో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఇంతమంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ కారణంగా అవి సరిపోలేదని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
#WATCH | Srikakulam: On the stampede at Venkateswara Swamy Temple in Kasibugga, Andhra Pradesh Minister Nara Lokesh says, “An unfortunate incident has happened in Kasibugga Venkateswara Swamy Temple. Today, being ekadashi, like never before pilgrims came here. They wanted to take… pic.twitter.com/0jk2l1M1qn
— ANI (@ANI) November 1, 2025
తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని నారా లోకేశ్ తెలిపారు. ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే సదుద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు, సిబ్బందిని ప్రశ్నిస్తామన్నారు. పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదని చెప్పారు. తీవ్రగాయాలన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.