Rajasekhar | తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ప్రత్యేక నటనతో, యాంగ్రీ మ్యాన్ ఇమేజ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెండు రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అభిమానులను కంగారు పెడుతున్నాయి. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘బైకర్’ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న రాజశేఖర్, తన ఆరోగ్యంపై ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. “నేను ఎన్నో సంవత్సరాలుగా ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) అనే సమస్యతో బాధపడుతున్నాను. ఈరోజు స్పీచ్ ఇవ్వాలనే ఉత్సాహంతో కడుపు సమస్య ఎక్కువైందీ, అయినా మాట్లాడాను,” అని ఆయన తెలిపారు.
రాజశేఖర్ వ్యాఖ్యలతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏమిటి అని చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. వైద్యుల ప్రకారం, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఒక దీర్ఘకాలిక జీర్ణాశయ వ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో మెదడు మరియు పేగులు సరైన సమన్వయంతో పనిచేయవు, దాంతో పేగుల్లో సున్నితత్వం పెరుగుతుంది. కడుపునొప్పి, ఉబ్బరం, విరోచనాలు, మలబద్ధకం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం లేదా మలపరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు.ఈ సమస్యను నియంత్రించేందుకు తక్కువ పరిమాణంలో తరచుగా ఆహారం తీసుకోవడం, ఫ్యాటీ, ప్రాసెస్డ్ లేదా ఎక్కువ కారం ఉన్న ఫుడ్స్‌కి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈవెంట్లో రాజశేఖర్ మాట్లాడుతూ ..“దర్శకుడు ఈ గ్లింప్స్‌ని ముందే చూపించి ఉంటే హీరో పాత్ర అడిగేవాడిని, కానీ ఇప్పుడే చూపించాడు. నేను ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే నటిస్తున్నాను,” అని నవ్వుతూ చెప్పారు. అలాగే గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ – “ఒకసారి విదేశాల్లో షూటింగ్ సమయంలో మా ఫోటోగ్రాఫర్ రాకపోవడంతో అక్కడ ఓ ఫోటోగ్రాఫర్‌ని తీసుకున్నాం. ఆయన ‘మీరు చాలా లక్కీ’ అన్నారు. ఎందుకని అడిగితే ‘చేతినిండా పని ఉంది’ అని చెప్పారు. అప్పుడు పెద్దగా అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతోంది. పని లేకపోతే జైల్లో ఉన్నట్టే,” అని రాజశేఖర్ చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు “మా హీరో త్వరగా కోలుకోవాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్ ప్రస్తుతం కొన్ని కొత్త సినిమాల స్క్రిప్ట్‌లను వింటున్నారని, త్వరలోనే మరో పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.