Jogi Ramesh | నకిలీ మద్యం కేసు.. ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) నేతల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒక్కొక్కరిని వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం కటకటాల్లోకి (TDP Govt) పంపిస్తున్నది. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను (Jogi Ramesh) ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) నేతల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒక్కొక్కరిని వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం కటకటాల్లోకి (TDP Govt) పంపిస్తున్నది. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను (Jogi Ramesh) ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్‌తోపాటు ఆయన సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరెపల్లి రామును అదుపులోకి తీసుకుని విజయవాడలోని సిట్ ఆఫీస్‌కు తరలించారు. నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్థన్‌రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 20కి చేరింది. జోగి రమేశ్‌ను ఏ18గా చేర్చే అవకాశం ఉన్నది.
ఆదివారం ఉదయం 5 గంటలకు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయన ఇంటివద్ద పోలీసులు మోహరించడంతో, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ హైడ్రామా నెలకొన్నది. రమేశ్‌తో చర్చించిన తర్వాత ఆయన నోటీసీలు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

కాగా, చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అని, రాక్షసానందం పొందడానికే తనను అక్రమంగా అరెస్టు చేశారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య బిడ్డల సాక్షిగా చెబుతున్నా.. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. అయినా నను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసే కుట్రలో భాగంగానే తన అరెస్టు అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

