Baba Ramdev : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను పతంజలి (Patanjali) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ (Baba Ramdev) తీవ్రంగా విమర్శించారు. దానిని టారిఫ్ టెర్రరిజం (Tariff terrorism) గా అభివర్ణించారు. మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితుల్లో దానిని ఆర్థిక యుద్ధంగా పేర్కొన్నారు.
స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలన్న విధానం ఆర్థిక యుద్ధానికి సరైన సమాధానం అవుతుందా..? అన్న మీడియా ప్రశ్నపై రామ్‌దేవ్ స్పందించారు. ట్రంప్ అనుసరించే సామ్రాజ్యవాద, విస్తారవాద పోకడలతో పోలిస్తే స్వదేశీ ఉద్యమం మెరుగైందని చెప్పారు. సమష్టిగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అది అవసరమైనదని తెలిపారు.
టారిఫ్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరమైనదని అన్నారు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఉంటే అది ట్రంప్ చేస్తున్న ఆర్థిక యుద్ధమేనని విమర్శించారు. ఈ యుద్ధంలోనైనా కనీసం పేద దేశాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్న వాళ్లు సామ్రాజ్యవాద, విస్తరణ పోకడలకు పోతున్నారని పేర్కొన్నారు.
ప్రపంచంలో శక్తి అతికొద్ది మంది వ్యక్తుల చేతిలోనే కేంద్రీకృతం కావాడాన్ని బాబా రామ్‌దేవ్ తప్పుపట్టారు. ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో ఉండాలని, సాటి మనిషిని పైకి తీసుకురావాలని సూచించారు. స్వదేశీ అనే నినాదం ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించడం అని బాబా చెప్పారు.