ములుగు : వాహనదారులు హెల్మెట్(Helmets) తప్పనిసరిగా ధరించాలి అని ఎస్పీ పి.శబరీష్ అన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహన దారులు హెల్మెట్స్ ధరించేలా పోలీసులు స్పెషల్ డ్రైడ్లు నిర్వహిస్తున్నారని ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు. అలాగే రోడ్డు భద్రత, నియమాలపై ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలను పరిశీలించగా ముఖ్యంగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే అధిక మరణాలు సంభవించినట్లు గుర్తించామన్నారు.
నిబంధనలు పాటించిన వారికి జరిమానా విధించామని మొత్తంగా 4 రోజులలో 1949 మందికి రూ.3,12,855 జరిమానా విధించినట్లు ఆయన వివరాలను వెల్లడించారు. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించి విలువైన తమ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్లు జరిమానాల కోసం కాకుండా ప్రజలలో మార్పు కోసమే నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. అదే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్ లు మరి కొంతకాలం కొనసాగుతాయని స్పష్టం చేశారు.