Kakinada | అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదని కన్నతల్లిని చంపేసిన కసాయి కొడుకు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదని కన్నతల్లిని చంపేశాడు ఓ కసాయి కొడుకు.
అమరావతి : ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదని కన్నతల్లిని చంపేశాడు ఓ కసాయి కొడుకు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 9వ తేదీన మధ్యాహ్న సమయంలో తల్లి నాగమణి (45) కొడుకు రాజబాబు భోజనం వడ్డించింది. తింటూ ఫ్రిడ్జ్ లోని నీళ్లు తెమ్మని తల్లిని అడిగాడు.
కాస్త ఆలస్యం కావడంతో రాజబాబు లేచి గట్టిగా అరుస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుండగా గుమ్మానికి గుద్దుకుని రాజబాబుకు గాయమైంది. దీంతో రాజబాబు విచక్షణ కోల్పోయి తల్లి తలను పూజ గదిలోని చెక్క బల్లకేసి బలంగా కొట్టి దాడి చేశాడు. గమనించిన స్థానికులు నాగమణిని కాకినాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

