Software Engineer | పని ఒత్తిడిని భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సతీశ్ (31)మియాపూర్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సతీశ్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా.. సంక్రాంతికి అతడి భార్య ఊరెళ్లింది. అయితే సతీశ్ ఏంతకీ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అతని తమ్ముడు తలుపులు పగులగొట్టాడు. లోపలికి వెళ్లేసరికి సతీశ్ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు.
సతీశ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సతీశ్ స్వస్థలం ఏపీలోని అమలాపురంలో తిల్లకుప్ప. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Cognizant jobs | కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా