Abhirami | వేధించేందుకు నెటిజన్స్ పోటీపడుతున్నారు.. సింగర్ భావోద్వేగపు పోస్ట్
Abhirami | వందలాది అసభ్యకరమైన కామెంట్లు, బాడీ షేమింగ్‌తో తాను తీవ్ర మానసిక వేదన అనుభవించానని, నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందని ప్రముఖ మలయాళ గాయని, నటి అభిరామి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఫిబ్రవరి 1న నిర్వహించిన ఓ లైవ్ మ్యూజిక్ షో అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల కారణంగా ఆమెపై నెటిజన్లు దారుణమైన విమర్శలు గుప్పించడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Abhirami | వందలాది అసభ్యకరమైన కామెంట్లు, బాడీ షేమింగ్‌తో తాను తీవ్ర మానసిక వేదన అనుభవించానని, నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందని ప్రముఖ మలయాళ గాయని, నటి అభిరామి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఫిబ్రవరి 1న నిర్వహించిన ఓ లైవ్ మ్యూజిక్ షో అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల కారణంగా ఆమెపై నెటిజన్లు దారుణమైన విమర్శలు గుప్పించడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది. ప్రదర్శనలో ఆమె కదలికలు, శరీర భంగిమలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ బాడీ షేమింగ్‌కు దిగడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలో అభిరామి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను “డస్ట్ బిన్… మాలిన్యపు కుప్ప”గా అభివర్ణించారు.
ఎవరిని ఎంత ఎక్కువగా అవమానించగలమో అనే పోటీ నెటిజన్ల మధ్య నడుస్తోందని, తాను ఒక లైవ్ పెర్ఫార్మర్నని, స్టేజ్‌పై బొమ్మలా నిలబడి పాడటం తన స్వభావం కాదని, ప్రదర్శన సమయంలో కదలడం, డ్యాన్స్ చేయడం తన కళలో భాగమని వివరించారు. శ్వాసను, శరీరాన్ని సంగీతానికి అంకితం చేస్తానని, అదే తన పెర్ఫార్మెన్స్ స్టైల్ అని ఆమె స్పష్టం చేశారు. అయితే విమర్శలతో పాటు కొందరు అభిమానులు, నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచి “మీరు వేధింపులకు గురవ్వడానికి అర్హులు కాదు” అంటూ ధైర్యం చెప్పడం కొంత ఓదార్పునిచ్చింది. ముఖ్యంగా ప్రదర్శన సమయంలో తీసిన వీడియోలను తప్పు కెమెరా యాంగిల్స్‌తో చిత్రీకరించడం వల్ల తాను అపహాస్యానికి గురయ్యానని అభిరామి ఆవేదన వ్యక్తం చేశారు.
గాయనీగా మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఆమె, ఆమె సోదరి అమృత సురేష్ కొంతకాలంగా ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అమృత సురేష్ తన వ్యక్తిగత వివాదాల కారణంగా గతంలో మీడియా విమర్శలకు గురవ్వగా, ఇప్పుడు అభిరామి విషయంలో నెటిజన్ల ప్రవర్తన మరింత బాధాకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ తాజా ఘటనతో సోషల్ మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అభిరామి ఇకపై ఇలాంటి విమర్శలతో పోరాడే శక్తి లేక కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

