Ishaan Tharoor: వాషింగ్టన్ పోస్టు దినపత్రికలో 300 మంది తొలగింపు.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు
Ishaan Tharoor: వాషింగ్టన్ పోస్టు దినపత్రికలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించారు. జాబ్ కోల్పోయిన జాబితాలో శశిథరూర్ కుమారుడు ఇషాన్ థారూర్ కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ కాలమిస్టుగా ఆ పత్రికలో ఇషాన్ పనిచేశారు.
న్యూయార్క్: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్(Ishaan Tharoor)ను ఉద్యోగం నుంచి తొలగించారు. అమెరికాకు చెందిన ద వాషింగ్టన్ పోస్టు దినపత్రికలో ఇషాన్ థరూర్ జర్నలిస్టుగా చేస్తున్నారు. ఆ సంస్థలో తాజాగా ఉద్యోగుల్ని తొలగించారు. మూడో వంతు అంటే సుమారు 300 మందిపై వేటు వేశారు. ఎడిటోరియల్ సిబ్బందికి చెందిన మూడో వంతు మందిని తొలగించడంతో ఆ సంస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జర్నలిజం భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారినట్లు ఆందోళనకు గురవుతున్నారు.
వాషింగ్టన్ పోస్టు పత్రికకు చెందిన విదేశీ బ్యూరో, లోకల్ రిపోర్టింగ్ బృందాలు, స్పోర్ట్స్ డెస్క్, బిజినెస్ డివిజన్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంపీ శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్.. ఆ పత్రికకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల్లో సీనియర్ కాలమిస్టుగా ఉన్నారు. తన ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని ఇషాన తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. చీకట్లో ప్రజాస్వామ్యం మరణిస్తుందని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.
అయితే ఆ పోస్టును శశిథరూర్ మళ్లీ షేర్ చేశారు. బ్యాడ్ డే అంటూ పేర్కొన్నారు. వరల్డ్ వ్యూవ్ కాలమ్‌ను 2017లో ఇషాన్ థారూర్ స్టార్ట్ చేశారు. ఆ వ్యాసాలతో ఆయన ఫేమస్ అయ్యారు. తనను తొలగించడం గుండెపగిలినంత పనైందన్నారు. వాషింగ్టన్ పోస్టులో పనిచేసిన ఎంతో మంది అత్యుత్తమ జర్నలిస్టులకు దూరం అవుతున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

