Chinese Manja | శేరిలింగంపల్లి, జనవరి 11 : ఓ యువకుడు చైనా మాంజా బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి సూర్య తేజ (27) చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.
సూర్య తేజ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. సూర్య తేజకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి.
సూర్య తేజ మాంజా ఛాతికి తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అదే గొంతుకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. గాయపడిన సూర్య తేజ స్థానిక యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స అందించేలా వైద్యులకు సూచించినట్లు పోలీసులు తెలిపారు.
Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం