కుభీర్ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) , మాజీ మంత్రి హరీష్ రావు( Harish Rao ) సూచించారు. హైదరాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా నేతలతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.
భైంసా మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా పెద్దగా చేసింది ఏమిలేదన్న సంకేతాలను నగర ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
6 గ్యారంటీలు, 420 హామీల అమలు గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇంకేమి చేయలేదని దోపిడీ పై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని వివరించాలని కోరారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించి భైంసా మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, విలాస్ గాదెవార్, డాక్టర్ పడకంటి రమాదేవి పాల్గొన్నారు.