e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News పాకిస్తాన్‌లో ఆందోళ‌న‌‌లు.. ఏడుగురు మృతి

పాకిస్తాన్‌లో ఆందోళ‌న‌‌లు.. ఏడుగురు మృతి

పాకిస్తాన్‌లో ఆందోళ‌న‌‌లు.. ఏడుగురు మృతి

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని ఫ్రెంచ్ రాయబారిని త‌క్ష‌ణ‌మే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్‌లో చాలా రోజులుగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు మృతిచెందారు. దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనల తరువాత, ఫ్రాన్స్ తన పౌరులను మూడు రోజుల్లోగా పాకిస్తాన్‌ను విడిచిపెట్టి ఫ్రాన్స్‌కు త‌ర‌లిపోవాల‌ని ఆ దేశం గురువారం త‌మ పౌరుల‌కు సలహా ఇచ్చింది.

పాకిస్తాన్లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం వ‌ద్ద‌ నిరసనలు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ వారం చివరిక‌ల్లా పాకిస్తాన్‌లోని ఫ్రెంచీ ప్ర‌జ‌లు స్వ‌దేశానికి తిరిగి రావాలని ఫ్రాన్స్ ప్ర‌భుత్వం సూచ‌న‌లు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఫ్రాన్స్ పౌరులందరికీ రాయబార కార్యాలయం నుంచి ఈ మెయిల్ వెళ్లింది.

చార్లీ హెబ్డో పత్రికలో మహమ్మద్ ప్రవక్తపై ప్రచురించిన కార్టూన్‌ను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆమోదించడంతో పాకిస్తాన్‌లో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్‌తో పాటు పలు ముస్లిం దేశాలు ఫ్రాన్స్‌ను వ్యతిరేకించడం మొద‌లెట్టాయి. ఈ దేశాలు ఫ్రాన్స్ ఉత్పత్తుల‌ కొనుగోలును కూడా నిలిపివేశాయి.

పాకిస్తాన్‌లో ఈ తరహా నిరసనలు ఎక్కువగా జరుగుతుండ‌టంతో ఫ్రాన్స్ ప్ర‌భుత్వం విచారం వ్య‌క్తం చేసింది. ఫ్రెంచ్ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించడానికి సాద్‌ హుస్సేన్ రిజ్వి అనే కట్టర్ ఇస్లామిక్ మతం గురువు ఒక ఫ్రంట్ తెరిచారు. రిజ్వి పార్టీ తెహ్రీక్-ఏ-లాబ్‌బాయిక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ) మద్దతుదారులు వేలాదిగా వీధుల్లోకి వ‌చ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

2000 మంది అరెస్టు

అంతకుముందు పాకిస్తాన్ ప్రభుత్వం సాద్ పార్టీ టీఎల్‌పీని ఉగ్రవాద సంస్థగా బుధవారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టింఇ నిషేధించింది. సాద్ ఏప్రిల్ 12 నుంచి పోలీసుల అదుపులో ఉన్నాడు. రిజ్వి అరెస్టు తరువాత పంజాబ్ ప్రావిన్స్‌లో త‌ర‌చుగా నిరసనలు జరుగుతున్నాయి. టీఎల్‌పీ మద్దతుదారులు పోలీసులతో ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డంతో ఐదుగురు పార్టీ మద్దతుదారులు, ఇద్ద‌రు పోలీసులు మరణించారు. ఇప్పటివరకు 2000 మందిని అరెస్టు చేశారు.

హింస కారణంగా బైషాకీ పండుగ సంద‌ర్భంగా రావ‌ల్పిండికి బ‌య‌ల్దేరిన‌ 815 మంది భారతీయ సిక్కులు అక్క‌డే చిక్కుకుపోయారు. వీరిని క్షేమంగా ఇండియాకు ర‌ప్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారి కుటుంబీకులు కోరుతున్నారు. వారిని సురక్షితంగా తిరిగి ర‌ప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

టీకా ఆఫ‌ర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోట‌ల్స్‌

స‌ముద్రంలో వంద‌లాది ప‌డ‌వ‌ల మోహ‌రింపు.. ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న పీఎల్ఏ

క‌చ్ వ‌ద్ద పాకిస్తానీయుల ప‌ట్టివేత‌.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం

66 ఏండ్ల క్రితం ప్రారంభ‌మైన మెక్‌డోనాల్డ్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

భార‌త్‌లో బోరిస్ జాన్స‌న్ ప‌ర్య‌ట‌న కుదింపు

చంద్రుడిపై రోవ‌ర్‌ను పంపేందుకు జ‌పాన్‌తో జ‌త‌క‌ట్టిన అర‌బ్ ఎమిరేట్స్

జూన్ 1 నుంచి హాల్‌మార్క్ న‌గ‌లే అమ్మాలి..

ఆప్రికాట్ పండ్ల‌తో ఆరోగ్యం

టీకా వేసుకోండి.. ఎక్కువ వ‌డ్డీ పొందండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాకిస్తాన్‌లో ఆందోళ‌న‌‌లు.. ఏడుగురు మృతి

ట్రెండింగ్‌

Advertisement