Stress | మహిళల్లో ఈ లక్షణాలు లేదా మార్పులు కనిపిస్తుంటే వారిపై దీర్ఘకాలిక ఒత్తిడి ఉందని అర్థం..
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి మహిళల జీవితంలో సాధారణ భాగంగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు, వ్యక్తిగత అంచనాలు అన్నింటినీ సమతుల్యం చేసేందుకు ప్రయత్నించే మహిళలు తరచూ అలసట, నిద్రలేమి, బరువు పెరగడం, నెలసరి సమస్యలు వంటి లక్షణాలను సాధారణ బర్నౌట్గా తీసుకుంటున్నారు.
Stress | నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి మహిళల జీవితంలో సాధారణ భాగంగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు, వ్యక్తిగత అంచనాలు అన్నింటినీ సమతుల్యం చేసేందుకు ప్రయత్నించే మహిళలు తరచూ అలసట, నిద్రలేమి, బరువు పెరగడం, నెలసరి సమస్యలు వంటి లక్షణాలను సాధారణ బర్నౌట్గా తీసుకుంటున్నారు. అయితే ఈ లక్షణాల వెనుక శరీరంలో నెమ్మదిగా ప్రారంభమవుతున్న ఆరోగ్య సమస్యలు దాగి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ రక్తపరీక్షల్లో అన్నీ సవ్యంగానే కనిపించినా, స్కానింగ్ పరీక్షలు మాత్రం లోపల జరుగుతున్న సూక్ష్మ మార్పులను బయటపెడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరిగి శరీరం ఎప్పుడూ అప్రమత్త స్థితిలోనే ఉండేలా చేస్తుందని వివరిస్తున్నారు. దీని ప్రభావం మెటబాలిజం, హార్మోన్ల సమతుల్యం, శరీర ఆరోగ్యంపై పడుతుందని చెబుతున్నారు.
తీవ్రంగా ఉండే ఆకలి..
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఇన్సులిన్ స్పందన దెబ్బతిని అధిక క్యాలరీల ఆహారం తినాలనే కోరిక పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. నిద్రలేమి, అసమయ భోజనం, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు సంకేతమని హెచ్చరిస్తున్నారు. అల్ట్రాసౌండ్ స్కాన్లలో ఇప్పుడు చాలా మంది మహిళల్లో ఫ్యాటీ లివర్ ప్రారంభ దశ లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బాహ్యంగా అధిక బరువు కనిపించకపోయినా, లివర్‌లో కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయని స్కాన్లు వెల్లడిస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది మెటబాలిక్ అసమతుల్యానికి ప్రారంభ హెచ్చరికగా భావిస్తున్నారు. పెల్విక్ స్కాన్లలో కొందరిలో ఓవరీస్ పెద్దవిగా మారి చిన్న చిన్న ఫాలికల్స్ కనిపిస్తున్నాయి. ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీకి సంకేతంగా ఉంటుంది. ముఖ్యంగా నెలసరి అసమతుల్యత, మొటిమలు, బరువు పెరగడం వంటి లక్షణాలు ఉన్న మహిళల్లో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
జుట్టు రాలడం, అలసట..
అలసట, జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి పెరగడం లేదా చిన్న నాడ్యూల్స్ ఏర్పడడం కూడా స్కాన్లలో బయటపడుతోంది. రక్తపరీక్షల్లో పెద్దగా మార్పులు కనిపించకపోయినా, ఈ నిర్మాణాత్మక మార్పులను స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చు. సీటీ స్కాన్ల వంటి ఆధునిక ఇమేజింగ్ పరీక్షలు అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే విస్సెరల్ ఫ్యాట్‌ను కూడా గుర్తిస్తున్నాయి. ఈ కొవ్వు ఇన్సులిన్ రెసిస్టెన్స్, గుండెజబ్బులు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతోంది. కొన్ని సందర్భాల్లో రొటీన్ బ్రెస్ట్ స్క్రీనింగ్ సమయంలో డెన్స్ బ్రెస్ట్ టిష్యూ లేదా సాధారణ బ్రెస్ట్ మార్పులు కూడా బయటపడుతున్నాయి. ఇవి నేరుగా ఒత్తిడివల్ల కాకపోయినా, దీర్ఘకాలిక హార్మోన్ల మార్పులు, జీవనశైలి ప్రభావం కారణంగా వస్తాయి.
రక్త పరీక్షల్లో తేలదు..
రక్తపరీక్షలు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంలో ముఖ్యమైనవే అయినా, అవి శరీర పరిస్థితిపై పూర్తి చిత్రాన్ని చూపవు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్, ఓవేరియన్ మార్పులు, థైరాయిడ్ నాడ్యూల్స్ వంటి సమస్యలు ప్రారంభ దశలో రక్తపరీక్షల్లో బయటపడవు. అలాంటి సమయంలో స్కానింగ్ పరీక్షలు లోపల జరుగుతున్న మార్పులను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి. అలసట, బరువు పెరగడం, నెలసరి అసమతుల్యత వంటి సమస్యలు చాలా కాలం కొనసాగితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కుటుంబంలో మెటబాలిక్ లేదా హార్మోన్ల సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి, బరువు పెరగడం కేవలం బయట కనిపించే సమస్యలు మాత్రమే కాదు, వాటి వెనుక శరీరంలో లోతైన మార్పులు దాగి ఉంటాయి. సమస్యలను ముందుగానే గుర్తిస్తే జీవనశైలి మార్పులు, సరైన చికిత్సల ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

