కల్పనాచావ్లా స్ఫూర్తితో కథ రాసుకున్నా!
‘ప్రస్తుతం సమాజంలో నెగెటివిటీ పెరిగిపోయింది. ఈ సినిమా చూసిన తర్వా త మనజీవితంలో కూడా కృష్ణలాం టి ఓ వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు అనుకుంటారు’ అన్నారు దర్శకుడు పవన్ సాధినేని.
‘ప్రస్తుతం సమాజంలో నెగెటివిటీ పెరిగిపోయింది. ఈ సినిమా చూసిన తర్వా త మనజీవితంలో కూడా కృష్ణలాం టి ఓ వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు అనుకుంటారు’ అన్నారు దర్శకుడు పవన్ సాధినేని. ఆయన నిర్ధేశకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు పవన్సాధినేని విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
వ్యోయగామి కావాలనే ఓ అమ్మాయి కలను సాకారం చేసేందుకు కృష్ణ అనే వ్యక్తి ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నదే చిత్ర కథాంశమని తెలిపారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆశను చిగురింపజేసే కథ ఇదని పేర్కొన్నారు. ‘ఇది యూనివర్సల్ కథ. అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం రెండేళ్లపాటు పరిశోధన చేశా. ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లను కలిసి వాళ్ల సలహాలను తీసుకున్నా. దాదాపు ఏడాదిన్నర ప్రీప్రొడక్షన్స్కే పట్టింది’ అని చెప్పారు. కరోనా లాక్డౌన్ టైంలో కల్పనా చావ్లా బయోగ్రఫీ చదువుతున్నప్పుడే ఈ కథకు బీజం పడిందని పవన్సాధినేని తెలిపారు. ‘ఆ పుస్తకం చదువుతున్నప్పుడు కల్పనా చావ్లా ప్రయాణం కంటే ఆమెపై భర్తకు ఉన్న ప్రేమ నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. అదే స్ఫూర్తితో ఈ కథ తయారు చేశా’ అని ఆయన వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

