మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి నోటీసులు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కార్ మాత్రం మూసీ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయంటూ బుకాయిస్తుండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఎన్జీటీలో విచారణ.. డిసెంబర్ 3కు వాయిదా
సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కార్ మాత్రం మూసీ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయంటూ బుకాయిస్తుండటంపై సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిటిషనర్ బాబురావు దాఖలు చేసిన అప్పీల్ నం. 50/2026 ఈ నెల 3న విచారణ జరగగా, ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి, కేసును డిసెంబర్ 3కు వాయిదా వేసింది. మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి ఇచ్చిన పర్యావరణ అనుమతులతో జీవావరణాన్ని దెబ్బతీసే ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో పర్యావరణవేత్త బాబురావు పిటిషన్ దాఖలు చేయగా, ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతిని సవాలు చేస్తూ అనుమతి మంజూరు ప్రక్రియను ట్రిబ్యునల్ ముందు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉత్తర్వు వెలువడి రెండు వారాలకుపైగా అయిన నేపథ్యంలో, కొన్ని మీడియా సంస్థలు స్టే ఇవ్వడానికి ట్రిబ్యునల్ నిరాకరించిందంటూ కథనాలు ప్రచురించాయి. అయితే అధికారిక ఉత్తర్వులో స్టే అంశం ప్రస్తావనే లేదని బాబురావు స్పష్టం చేశారు. ఆ ఉత్తర్వులో కేవలం నోటీసులు, కౌంటర్ల దాఖలు, వాయిదాకు సంబంధించిన ప్రక్రియపై ఉత్తర్వులు మాత్రమేనని, ప్రాజెక్టుకు అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎలాంటి వ్యాఖ్యలు లేవన్నారు. ఉత్తర్వు ఎన్జీటీ వెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 3న జరగనున్నది. ఆ రోజు ప్రతివాదుల జవాబులను పరిశీలించిన అనంతరం ట్రిబ్యునల్ తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

