హెచ్ఎండీఏ ప్లాట్లకు 22ఏ చిక్కులు!
హెచ్ఎండీఏ వేలం వేసిన భూములు 22ఏ చిక్కుల్లో ఇరుక్కున్నాయి. కోట్ల రూపాయలు చెల్లించి ప్లాట్లు దకించుకున్న కొనుగోలుదారులు, రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తమ ప్లాట్లపై చట్టబద్ధమైన హకులు పొందలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
- వేలంలో కొన్నా..రిజిస్ట్రేషన్‌కు నోచుకోని వైనం
- కార్యాలయాల చుట్టూ కొనుగోలుదారుల ప్రదక్షిణలు
సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ వేలం వేసిన భూములు 22ఏ చిక్కుల్లో ఇరుక్కున్నాయి. కోట్ల రూపాయలు చెల్లించి ప్లాట్లు దకించుకున్న కొనుగోలుదారులు, రిజిస్ట్రేషన్ కాకపోవడంతో తమ ప్లాట్లపై చట్టబద్ధమైన హకులు పొందలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి శంకర్పల్లి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మొకిలా వద్ద హెచ్ఎండీఏ 165 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి చేసింది. ఇందులో మొత్తం 1,293 ప్లాట్లను రూపొందించి, బహిరంగ వేలం ద్వారా విక్రయించింది. ప్రధాన రహదారికి దగ్గరగా ఉండటం, నగర శివారులో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఈ ప్లాట్లకు కొనుగోలుదారుల నుంచి భారీ డిమాండ్ వచ్చింది. ఇదే తరహాలో ఇటీవల వేలం వేసిన 100 ప్లాట్లను కొనుగోలుదారులు చదరపు గజానికి రూ.1,09,500 చొప్పున చెల్లించి దకించుకున్నారు. వేలం నిబంధనల ప్రకారం దక్కించుకున్న వారు నిర్ణీత గడువులోగా సొమ్ము చెల్లించినా, ప్రభుత్వ సంస్థ నిర్వహించిన వేలం కావడంతో భూమి వివాదరహితమని, రిజిస్ట్రేషన్ జరుగుతుందనీ భావించినా సర్కారు తెచ్చిన నిషేధిత జాబితాలో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతున్నాయి.
మోకిల లే అవుట్ నిషేధిత జాబితాలో
మోకిల లేఅవుట్లోని సర్వే నంబర్ 96/పీలో కొంత భాగం 22ఏ జాబితాలో ఉందని పేరొంటూ రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. దీంతో వేలంలో ప్లాట్లు కొని, పూర్తి మొత్తం చెల్లించిన యజమానులు సేల్ డీడ్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ ప్రకారం కొన్నిరకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిషేధం. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, భూదాన్ భూములను క్రయవిక్రయాలకు తావులేకుండా నిషేధించింది. ఒక సర్వే నంబర్ ఈ జాబితాలో ఉంటే, అందులోని భూమికి సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకోవడంతో కొనుగోలు చేసిన వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆ సర్వే నంబర్‌ను జాబితా నుంచి తొలగిస్తేనే గానీ రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని అంటున్నారు.
రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ప్లాట్లపై చట్టబద్ధమైన యాజమాన్య హకు లేక ఇబ్బంది పడుతున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆ సొమ్ము నిరుపయోగంగా మారింది. రిజిస్ట్రేషన్ లేకుండా బ్యాంకు రుణాలు, ఇంటి నిర్మాణ అనుమతులు పొందడం కష్టం కావడంతోపాటు ప్లాట్లను తిరిగి విక్రయించే అవకాశం లేకుండా పోయిందంటున్నారు. భూమి స్థితిని ముందే పూర్తిగా పరిశీలించకుండా వేలం నిర్వహించడం హెచ్ఎండీఏ నిర్లక్ష్యమేనని వారు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

