Omar Abdullah : బాలీవుడ్ (Bollywood) కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Actor Dharmendra) మృతికి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM), నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) పార్టీ అగ్ర నాయకుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సంతాపం వ్యక్తంచేశారు. తాను చిన్నప్పటి నుంచి ధర్మేంద్ర సినిమాలు చూస్తున్నానని గుర్తుచేసుకున్నారు.
‘నేను చిన్ననాటి నుంచి ధర్మేంద్ర సినిమాలు చూస్తున్నా. ఆయన నటించిన సినిమాల్లో షోలే, బర్నింగ్ ట్రెయిన్, షాలిమార్ లాంటి ఎన్నో సినిమాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయన మరణవార్త నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన జమ్ముకశ్మీర్‌కు నేస్తంలా ఉండేవారు’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
#WATCH | Jammu | On veteran actor Dharmendra’s demise, J&K CM Omar Abdullah says, “Since childhood, I have been watching Dharmendra ji’s films. I remember many of his films like Sholay, Burning Train and Shalimar. I am saddened by his demise. I express my condolences to his… pic.twitter.com/MWYrrQfcim
— ANI (@ANI) November 24, 2025