Hyderabad | హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో తుపాకీ మిస్‌ఫైర్ కలకలం రేపింది. అంబర్‌పేట సీసీఎల్ గ్రౌండ్లో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఏపీ కేడర్‌కు చెందిన కానిస్టేబుల్ గోవర్దన్ రెడ్డి భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.