గౌహతి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు(INDvSA) ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 201 రన్స్‌కు ఆలౌటైంది. ఇవాళ మూడో రోజు భారత బ్యాటర్లు తడబడ్డారు. దీంతో సౌతాఫ్రికాకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 288 రన్స్ ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లు.. 8వ వికెట్‌కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఇండియా కేవలం 83.5 ఓవర్లలో ఆలౌటైంది. సుందర్ 92 బంతుల్లో 48 రన్స్ చేయగా, కుల్దీప్ 134 బంతుల్లో 19 రన్స్ చేశాడు. సఫారీ బౌలర్ మార్కో జేన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్ హార్మర్ 64 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు.
Innings Break!#TeamIndia trail South Africa by 288 runs.
Over to our bowlers in the second innings.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/qG9qEx4j94
— BCCI (@BCCI) November 24, 2025