ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేడు(శుక్రవారం) రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆయా నియోజకవర్గాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు నిరసన తెలుపనున్నారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో మంత్రి హరీశ్‌రావు, దుబ్బాకలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, చేర్యాలలో స్థానిక శ్రేణులు, రైతులు పాల్గొననున్నారు. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆందోల్‌లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు, పటాన్‌చెరువులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ నేతృత్వంలో రైతు ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో పాటు జడ్పీ, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
సిద్దిపేట, నవంబర్ 11( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం భారీ ఎత్తున రైతు మహాధర్నా కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసి, తెలంగాణలో కొనుగోలు చేయకుండా కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్న విషయాన్ని రైతులకు వివరించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు.
ఈ మహాధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొంటారు. గజ్వేల్‌లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, చేర్యాలలో స్థానిక పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొననున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు శేరి సుభాశ్‌రెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆందోల్‌లో ఎమ్మెల్యే చంటి క్రాంతి, నారాయణ్‌ఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు, పటాన్‌చెరువులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ నేతృత్వంలో రైతు ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ధర్నాకు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో పాటు జడ్పీచైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు రైతులు తరలిరానున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమానికే వేస్తున్నదన్నారు. కరోనా సమయంలోనూ గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకూ ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇవాళ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నకు ఇంత వరకు సమధానం చెప్పలేదని, రెండు నాల్క ల ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ విమర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.